లాలూకి మరో 5 ఏళ్ళు జైలు శిక్ష

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.139 కోట్ల దాణా కుంభకోణం కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్  దోషిగా నిర్ధారించబడిన సంగతి తెలిసిందే. సిబిఐ కోర్టు ఆయనకు 5 ఏళ్ళు జైలు శిక్ష, రూ.60 లక్షల జరిమానా విధిస్తూ నిన్న తీర్పు చెప్పింది. ఇప్పటికే దీనికి సంబందించి మరో నాలుగు కేసులలో ఆయనకు 14 ఏళ్ళు జైలు శిక్ష విధించగా మూడున్నరేళ్ళు జైలులో గడిపి ఇటీవల అనారోగ్యానికి గురవడంతో బెయిల్‌పై బయటకు వచ్చారు. లాలూ ప్రసాద్ మళ్ళీ మరో బెయిల్‌ పిటిషన్‌ పెట్టుకోగా సిబిఐ కోర్టు దానిని తిరస్కరించడంతో పోలీసులు అరెస్ట్ చేసి బిర్సాముండాలోని సెంట్రల్ జైలుకి తరలించారు.