24.jpg)
సిఎం కేసీఆర్ నేడు నారాయణఖేడ్‌లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ చేరుకొంటారు. సంగారెడ్డి జిల్లాలో త్రాగు, సాగునీటి సమస్యలకు శాస్విత పరిష్కారంగా రూ.4,427 కోట్లు వ్యయంతో చేపట్టబోయే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పధకానికి సిఎం కేసీఆర్ శంఖుస్థాపన చేస్తారు. తరువాత స్థానిక అనురాధ డిగ్రీ కాలేజీ ఆవరణలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తరువాత హెలికాప్టర్లో హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు.
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పధకం ద్వారా సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్‌లోని మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హన్మంతరావు నిన్న సభ వేదిక ఏర్పాట్లు పరిశీలించారు. సభకు సుమారు లక్షమందికి పైగా జనాలను తరలించేందుకు టిఆర్ఎస్ శ్రేణులు జనసమీకరణ చేస్తున్నాయి. సిఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఎస్పీ రమణ కుమార్ నారాయణఖేడ్‌లో పోలీసులను మోహరించి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు.