సిఎం కేసీఆర్‌ నేడు మేడారం పర్యటన

సిఎం కేసీఆర్‌ శుక్రవారం ఉదయం మేడారం వెళ్ళి సమ్మక్క సారలమ్మను దర్శించుకొనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. మేడారంలో గద్దెల వద్ద సమ్మక్క సారలమ్మలకు పూజలు చేసిన తరువాత మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం అవుతారు. గద్దెలపైకి నలుగురు వనదేవతలు కూడా చేరడంతో మేడారంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. నిన్న ఒక్కరోజే సుమారు 30 లక్షలమంది భక్తులు మేడారంకు తరలివచ్చారు. ఈరోజు భక్తులు మొక్కులు చెల్లించుకొనే రోజు కావడంతో రద్దీ ఇంకా పెరుగుతుంది. ఇటువంటి సమయంలో సిఎం కేసీఆర్‌ మేడారంకు వస్తుండటంతో మరింత భద్రత కల్పించాల్సి ఉంటుంది. కనుక జిల్లా అధికారులకు, ముఖ్యంగా పోలీసులకు సిఎం కేసీఆర్‌ మేడారం పర్యటన ముగిసేవరకు కత్తిమీద సామే.