
రాష్ట్రంలో మరో భారీ ఐటి పార్క్ నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. హైదరాబాద్ శివార్లలో కండ్లకోయలో ‘తెలంగాణ గేట్ వే’ పేరుతో రూ.250 కోట్లు వ్యయంతో ఐటి పార్క్ నిర్మించబోతోంది. దీనికి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఈరోజు శంఖుస్థాపన చేశారు. 10.11 ఎకరాలలో విస్తరించి ఉండే ఈ పార్క్లో 14 అంతస్తుల భవనం నిర్మించబోతున్నారు. దీనిలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల కార్యాలయాలు ఐటి కంపెనీలకు అందుబాటులోకి వస్తాయి. తెలంగాణ గేట్ వేలో మొత్తం 70 ఐటి కంపెనీలు రానున్నాయి. వాటి ద్వారా సుమారు 50 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, అనేకవందల మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నాయి.