రేవంత్‌ రెడ్డి అరెస్ట్..పోలీస్‌స్టేషన్‌కు తరలింపు

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈరోజు సిఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా టిఆర్ఎస్‌ శ్రీనులు రాష్ట్రవ్యాప్తంగా ఆయన జన్మదినా వేడుకలు ఘనంగా జరుపుకొంటున్నాయి. ఈ సందర్భంగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలక్షేపం చేస్తున్నందుకు నీరసంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఈ మూడు రోజులు ఆందోళనలు చేయాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరుతుండగా పోలీసులు వచ్చి రేవంత్‌ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డికి పోలీస్ అధికారులకు మద్య కాసేపు వాగ్వాదం జరిగింది కానీ పోలీసులు బలవంతంగా రేవంత్‌ రెడ్డిని కారులో ఎక్కిస్తుండటంతో ఆయన అనుచరులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వారిని చెదరగొట్టి రేవంత్‌ రెడ్డిని గోల్కొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.