28.jpg)
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు నిన్నటి నుంచి మూడు రోజులు ఘనంగా వేడుకలు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ శ్రేణులు రక్తదాన శిబిరాలు, ఆన్నదానాలు, నిరుపేద విద్యార్దులకు నోట్ బుక్కులు అందిస్తూ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిఎం కేసీఆర్ చిరకాలం ఆయురాగ్యాలతో వర్ధిల్లుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుతూ టిఆర్ఎస్ శ్రేణులు ఆలయాలలో సిఎం కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు.
నేటితో 68వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సిఎం కేసీఆర్‌కు ప్రధాని నరేంద్రమోడీ, వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిద రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సామాజిక మాద్యమాల ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తెరిచి ఉన్న పుస్తకం వంటి కేసీఆర్ జీవితచరిత్ర గురించి అందరికీ తెలుసు. కేసీఆర్ తల్లితండ్రులు రాఘవరావు, వెంకటమ్మ. ఆ పుణ్యదంపతులకు 1954, ఫిబ్రవరి 17న సిద్ధిపేటలో జన్మించారు. 2001లో టిఆర్ఎస్‌ను స్థాపించి, రాష్ట్ర ప్రజలందరినీ, అన్ని పార్టీలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి 14 ఏళ్లపాటు ఏకధాటిగా పొరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అప్పటి నుంచి తాను కలలుగన్న బంగారి తెలంగాణ కోసం ఆహారహం కృషి చేస్తూ కేవలం 7 ఏళ్ళలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టి చూపారు. అందుకే రాష్ట్ర ప్రజలు ఆయనకు జేజేలు పలుకుతున్నారు.
తెలంగాణ సాధించి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న సిఎం కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజల తరపున మైతెలంగాణ.కామ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.