
నేడు యూపీలో రెండో దశ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభంకాగా గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఒకే దశలో జరిగే ఎన్నికలకు పోలింగ్ మొదలైంది.
యూపీలో మొత్తం 408 స్థానాలలో ఫిబ్రవరి 10వ తేదీన జరిగిన మొదటిదశ ఎన్నికలలో 58 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఇవాళ్ళ 9 జిల్లాలలో మరో 55 స్థానాలకు పోలింగ్ మొదలైంది. వీటికి 586 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. మొదటి విడత పోలింగ్ జరిగిన నియోజకవర్గాలలో ఢిల్లీ సరిహద్దులో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాదిపాటు జరిగిన ఆందోళనలలో పాల్గొన్న జాట్ ఓటర్లు ఎక్కువగా ఉండగా, ఈరోజు ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న 55 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గాలలో మజ్లీస్ పార్టీ తన అభ్యర్ధులను నిలబెట్టింది. మళ్ళీ ఈ నెల 20వ తేదీన మూడో దశఎన్నికలు జరుగుతాయి.
గోవాలో 40, ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలకు నేడు ఒకే దశలో పోలింగ్ పూర్తవుతుంది. గోవాలో 40 స్థానాలకు కాశ్, బిజెపిలతో కలిపి మొత్తం 301 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలకు 632 మంది పోటీ పడుతున్నారు. వచ్చే నెల 10వ తేదీన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.