సంబంధిత వార్తలు
6.jpg)
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ సబ్ కమిటీ మొదటి సమావేశం జరగనుంది. ఈ సబ్ కమిటీలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉన్నారు.
ఈ సమావేశంలో ప్రభుత్వాసుపత్రులలో వైద్య సేవలు, సౌకర్యాలను మెరుగుపరచడం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇతర రాష్ట్రాలలో లభిస్తున్న వైద్య సేవలు, అక్కడి మౌలిక సదుపాయాలపై కూడా చర్చించి వాటిలో మెరుగైన విధానాలను, సౌకర్యాలను రాష్ట్రంలో అమలుచేసే విషయంపై చర్చించనున్నారు.