సంబంధిత వార్తలు
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త! 2021 జనవరి మొదటివారం నుంచి నగరంలో ప్రటీ ఇంటికీ నెలకు 20,000 లీటర్లు చొప్పున ఉచితంగా మంచినీటిని సరఫరా చేయాలని మునిసిపల్ శాఖామంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈనెల (డిసెంబర్)లో వాడుకొన్న నీటికి సైతం దీనిని వర్తింపజేసి, 20,000 లీటర్ల వరకు ఎటువంటి ఛార్జీలు వసూలు చేయవద్దని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ శనివారం జీహెచ్ఎంసీ పరిధిలో ఉచిత త్రాగునీరు సరఫరా పధకంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్, జలమండలి ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.