ఆ బ్యాలెట్ పేపర్లను లెక్కించొద్దు: హైకోర్టు

బిజెపి వేసిన హౌజ్ మోషన్ పిటిషన్‌పై ఈరోజు ఉదయం అత్యవసర విచారణ జరిపిన హైకోర్టు, స్వస్తిక్ ముద్ర కాకుండా వేరే ముద్రలతో వేసిన ఓట్లను పరిగణనలోకి తీసుకోరాదని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో నిన్న అర్ధరాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు రద్దయ్యాయి. అధికార టిఆర్ఎస్‌ కనుసన్నలలో పనిచేస్తున్న ఎన్నికల సంఘానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టువంటిదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. అయితే ఈ తాజా తీర్పు వలన రాష్ట్ర ఎన్నికల సంఘం నష్టపోయేదేమీ ఉండదు కానీ దొంగఓట్లు వేద్దామని ప్రయత్నించిన పార్టీలకు ఇది పెద్ద ఎదురుదెబ్బే.