జీహెచ్‌ఎంసీలో 46.68 శాతం పోలింగ్ నమోదు

మంగళవారం జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో 149 డివిజన్‌లలో మొత్తం 46.68 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం బుదవారం ప్రకటించింది. బ్యాలెట్ పేపర్లలో సిపిఐ, సిపిఎం ఎన్నికల గుర్తులు తారుమారుగా ముద్రించినందున ఎన్నికల సంఘం ఓల్డ్ మలక్‌పేటలో ఎన్నికలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ రేపు అక్కడ రీపోలింగ్ నిర్వహించబోతోంది. కనుక దాంతో కలిపితే పోలింగ్ శాతం మరికొంత పెరుగుతుంది. కానీ రీపోలింగ్ నిర్వహిస్తున్నందున ఓటర్లు తమ పనులు మానుకొని వస్తారో లేదో చూడాలి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి వెంటవెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. ఈసారి చాలా తక్కువ పోలింగ్ శాతం నమోదైనందున మధ్యాహ్నం ఒంటిగంటలోపే పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.