ఇవాళ్ళ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఉండవు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ఇవాళ్ళ సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది కనుక ఆ తరువాత వివిద మీడియా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించడానికి సిద్దంగా ఉన్నాయి. అవి జరిపిన తాజా సర్వేలలో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయో అంచనా వేసి ఎగ్జిట్ పోల్స్‌లో ప్రకటిస్తాయి. ఈసారి టిఆర్ఎస్‌-బిజెపిల మద్య చాలా భీకరంగా పోరు సాగినందున తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ఏపీలో ప్రజలు కూడా ఎగ్జిట్ పోల్స్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. 

కానీ ఓల్డ్ మలక్‌పేటలో బ్యాలెట్ పేపర్లలో సిపిఐ, సిపిఎం పార్టీల ఎన్నికల గుర్తులు తారుమారవడంతో అక్కడ పోలింగ్ రద్దు చేసి మళ్ళీ గురువారం పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కనుక గురువారం సాయంత్రం ఓల్డ్ మలక్‌పేటలో పోలింగ్ ముగిసేవరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడంపై నిషేదం విధిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కనుక గురువారం సాయంత్రం వరకు ఈ సస్పెన్స్ కొనసాగనుంది.