
ఈ నెల 25 నుంచి (విజయదశమి) కొత్త సచివాలయం నిర్మాణపనులు మొదలుపెట్టేందుకు రోడ్లుభవనాల శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ దసరా పండుగరోజున నిర్మాణ పనులు ప్రారంభించి వచ్చే ఏడాది దసరా పండుగ రోజున కొత్త సచివాలయానికి ప్రారంభోత్సవం చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి తెలిపారు.
సచివాలయం నిర్మాణం కోసం ఆర్అండ్బీ ఇప్పటికే టెండర్లు ఆహ్వానించి, వివిద సంస్థల నుంచి బిడ్స్ స్వీకరించింది. ఈ నెల 15న సాంకేతిక బిడ్స్, 19న ప్రైసింగ్ బిడ్స్ తెరుస్తారు. ఆదేరోజున కమీషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ) వాటిలో ఎంపికైన సంస్థకు ఆమోద పత్రం అందజేస్తారు. ఆమోదపత్రం ఇచ్చిన 15 రోజులలోగా లాంఛనంగా నిర్మాణపనులు ప్రారంభించాల్సి ఉంటుంది.