భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబం గౌరవార్ధం మంగళవారం రాత్రి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్లో వారికి విందు ఇవ్వనున్నారు. దానికి ఆహ్వానం అందుకున్న తెలంగాణ సిఎం కేసీఆర్ ఈరోజు డిల్లీ వెళ్ళనున్నారు. వారికోసం సిఎం కేసీఆర్ ప్రత్యేక కానుకలు కూడా తీసుకువెళుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పోచంపల్లి శాలువా కప్పి చార్మినార్ మేమెంటో అందించనున్నారు. అమెరికా ప్రధమ మహిళా మెలానియా ట్రంప్‌కు, ఇవాంకాలకు గద్వాల, పోచంపల్లి పట్టుచీరలను బహుకరించనున్నారు.
తెలుపు దుస్తులను ఎక్కువగా ఇష్టపడే మెలానియా ట్రంప్ నిన్న అహ్మదాబాద్ వచ్చినప్పుడు తెలుపు దుస్తులే ధరించివచ్చారు. ఆమె నడుముకు ఒక ఆకుపచ్చ పట్టువస్త్రం కట్టుకొని వచ్చారు. ట్రంప్ దంపతులు భారత్‌లో పర్యటిస్తున్న సందర్భంగా ఆమె కోసం ఆమె ఫ్యాషన్ డిజైనర్ రాచెల్ రాయ్ ప్రత్యేకంగా దానిని డిజైన్ చేశారట. ఇప్పుడు సిఎం కేసీఆర్ ఆ ఇద్దరు మహిళలకు ఏకంగా పట్టు చీరలే బహుమానంగా ఇస్తున్నారు.