కేంద్రమంత్రి నితిన్ గడ్కారీతో తెరాస ఎంపీలు భేటీ

 మంత్రి జగదీష్ రెడ్డి, తెరాస ఎంపీలు మంగళవారం డిల్లీలో కేంద్ర ఉపరితలరవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీని కలిసి తెలంగాణలో రోడ్లు, జాతీయ రహదారులకు సంబందించిన అంశాల గురించి చర్చించారు. వరంగల్-భూపాలపల్లి, ఆలేరు నియోజకవర్గంలో రహదారులపై స్థానిక ప్రజల సౌకర్యార్ధం చెరో రెండు అండర్ పాస్‌లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. కోదాడ-మిర్యాలగూడ మార్గంలో గల కొన్ని గ్రామాలకు రోడ్లతో అనుసంధానం చేయాలని కోరారు. రాష్ట్రం గుండా సాగుతున్న 1350 కిమీ పొడవు గల జాతీయరహదారులలో కొన్ని ప్రాంతాలలో జాతీయరహదారుల గుర్తింపు కోసం ఇచ్చే సంఖ్యను కేటాయించలేదని, కనుక వాటికి నిర్ధిష్ట సంఖ్యలు కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో రోడ్ల మరమత్తులకు అవసరమైన నిధులు విడుదల చేయవలసిందిగా తెరాస ఎంపీలు విజ్ఞప్తి చేశారు.