నేటి నుంచే రైతుబంధు చెక్కుల పంపిణీ

నేటి నుంచే రాష్ట్రంలో రెండవ విడత రైతుబంధు చెక్కుల పంపిణీ ప్రారంభం కాబోతోంది. పాత పధకమైన బతుకమ్మ చీరల పంపిణీకి అభ్యంతరం చెప్పిన ఎన్నికల కమీషన్, రైతుబంధు చెక్కుల పంపిణీకి మాత్రం అంగీకరించడం విశేషం. ఇవాళ్ళ 10 జిల్లాలలో బ్యాంకుల ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడానైకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో పాసు పుస్తకాలు కలిగి ఉన్న రైతులు మొత్తం 52.15 లక్షల మంది ఉన్నారు. వారందరికీ ఎకరానికి రూ.4,000 చొప్పున రెండవ విడత రైతుబంధు చెక్కులను రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అందజేయబోతోంది.