సంబంధిత వార్తలు

ముందస్తు ఎన్నికలకు ముందు తెలంగాణాలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆయన సహచరుల ఇళ్లపై జరిగిన ఐటిు దాడులపై సర్వత్రా చర్చలు జరుగుతుండగానే ఈరోజు విజయవాడ, గుంటూరులో దాడులకు ఐటిే అధికారులు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఐటిగ దాడులకు సహకరించడానికి పోలీసులను సిద్దంగా ఉంచాలని కోరుతూ ఐటిు అధికారులు విజయవాడ పోలీస్ కమీషనర్ కు లేఖ వ్రాసినట్లు సమాచారం. గురువారం నెల్లూరులో ఒక ప్రముఖ టిడిపి నేత ఇల్లు, కార్యాలయాలపై దాడులు జరుగడంతో ఇవాళ్ళ టిడిపి నేతల ఇళ్ళపైనే ఐటిి దాడులు జరుగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నిజమో కాదో మరికొద్ది సేపటిలో తేలిపోవచ్చు.