రేవంత్ రెడ్డి ఇంటిపై కొనసాగుతున్న ఐటిe దాడులు

టి‌-కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహిత బందువులు, వ్యాపార భాగాస్వాముల ఇళ్ళపై వరుసగా రెండవరోజు కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డిపై ఐటిస అధికారులు మనీ లాండరింగ్, బ్లాక్ మనీ, ఫెమా, ఇంకా మరికొన్ని చట్టాల క్రింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం కోస్గిలో ఎన్నికల ప్రచారం ముగించుకొని హైదరాబాద్‌ తిరిగిరాగానే, ఆయన ఇంటిలో ఉన్న లాకర్లను తెరిపించి వాటిలో పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం ఆయన ఆర్ధికలావాదేవీలు, ఆదాయపన్ను చెల్లింపులు, విదేశాల నుంచి ఆయనకు, ఆయన బందువుల బ్యాంక్ ఖాతాలలోకి వచ్చిన డబ్బు వివరాలు, ఆయనకు బహుమతిగా లభించిన విదేశీకారు ఇంకా అనేక విషయాలపై ఐటిా అధికారులు రేవంత్ రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం.

ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహల ఇళ్ళలో కూడా సోదాలు నిర్వహించి వారిరువురినీ సోమవారంలోపుగా వాటిపై వివరణ ఇవ్వాలని నోటీస్ ఇచ్చినట్లు సమాచారం. ఐటిన అధికారులు బయటకు తీస్తున్న ఈ లెక్కలను చూస్తే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయంగానే కనిపిస్తోంది. తనపై ఐటిు, ఈడీ దాడులు జరుగవచ్చని రేవంత్ రెడ్డి చెప్పారు. అవి నిజం అయ్యాయి. తనను జైలుకు పంపించవచ్చని కోస్గి సభలో చెప్పారు. కనుక అదీ నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది.