రేవంత్ రెడ్డి ఇంటిపై ఐ‌టి దాడులు

తెలంగాణా కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం ఉదయం ఏకసమయంలో దాడులు చేశారు. హైదరాబాద్‌ లోని ఆయన కార్యాలయం, కొడంగల్ లోని ఆయన నివాసంతో పాటు మరికొన్ని చోట్ల ప్రస్తుతం ఐటిి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

తనపై ఐటిా లేదా ఈడీ దాడి చేయవచ్చునని రేవంత్ రెడ్డి వారం రోజుల క్రితమే ప్రకటించారు. తనకు కాంగ్రెస్ పార్టీలో కీలకపదవి ఏదైనా లభిస్తే ఎన్నికలలో టిఆర్ఎస్‌కు ఇబ్బంది కలుగుతుందని కనుక తనను అదుపుచేయాలని సిఎం కెసిఆర్‌ ప్రధాని మోడీకి లేఖ వ్రాశారని, దానిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తనకు సమాచారం ఉందని చేపపారు. కాంగ్రెస్‌ కమిటీలో తనకు పదవి లభించక మునుపే తనపై, తన బందువులు, స్నేహితులు ఇళ్ళు, కార్యాలయాలపై ఐటి లేదా ఈడీ దాడులు నిర్వహించవచ్చని రేవంత్ రెడ్డి ఆరోజే చెప్పారు. ఎన్నికలకు ముందు తనపై తప్పుడు కేసులు మోపి తనను జైలుకు పంపించాలని సిఎం కెసిఆర్‌ ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే ఇటువంటి తాటాకు చప్పుళ్ళకు తాను భయపడే వ్యక్తిని కానని, ఈసారి ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించి సిఎం కెసిఆర్‌ను గద్దె దించుతానని రేవంత్ రెడ్డి శపధం చేశారు. ఈరోజు ఐటిజ దాడులు జరగడంతో రేవంత్ రెడ్డి ఆరోపణలకు బలం చేకూరినట్లయింది.