అందుకే కాంగ్రెస్‌లో చేరాము: కొండా సురేఖ

కొండా సురేఖ ఈరోజు డిల్లీ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “ టిఆర్ఎస్‌ పాలనలో బిసిలకు తీరని అన్యాయం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని భావించి బేషరతుగా పార్టీలో చేరాము. టిఆర్ఎస్‌ నేతలు మాపై దుష్ప్రచారం చేస్తూ మా ప్రతిష్టను దెబ్బ తీయాలని చూస్తున్నారు. కానీ వారు ఎన్ని కుట్రలు చేసినా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కనీసం 5-6 సీట్లు గెలిపించి రాహుల్ గాంధీకి బహుమతిగా ఇస్తాము. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన తరువాతే మళ్ళీ మేము రాహుల్ గాంధీని కలుస్తాము. ఇక నుంచి రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం గట్టిగా కృషి చేస్తాం. 

కొండా సురేఖకు పార్టీ తరపున పదవులు, టికెట్ల కోసం ఎటువంటి హామీలు ఇవ్వలేదని, వారు బేషరతుగా పార్టీలో చేరారాణి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆమెకు టికెట్ కేటాయించే విషయం ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చూసుకొంటుందని చేపపారు. కొండా సురేఖను ఎన్నికల ప్రచార కమిటీలో సభ్యురాలిగా తీసుకొంటున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.