
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా టికెట్ లభించిన టి. రాజయ్య ఒక మహిళతో ఫోన్లో సరసమాడుతున్న ఆడియో క్లిప్పింగ్ మీడియాకు లీక్ అయ్యింది. ఆయన నాని అనే మహిళతో అక్రమ సంబంధం కలిగిఉన్నట్లు వారి మాటల ద్వారా స్పష్టం అవుతోంది. ఆమెకు రాజయ్య ఒక్కరితోనే కాక దయాకర్, వెంకటేశ్వర్లు అనే మరో ఇద్దరు టిఆర్ఎస్ నేతలతో కూడా అక్రమ సంబంధాలున్నట్లు వారి సంభాషణలో తేలింది.
ఆమె తనకు ఏదో పార్టీ పదవి కావాలని అడిగినప్పుడు దయాకర్, వెంకటేశ్వర్లు దగ్గరకు కూడా వెళుతున్నావు కదా వారినే అడగలేకపోయావా? అని రాజయ్య ప్రశ్నించగా, నువ్వే నా హీరోవి అంటూ ఆమె ఏదో చెప్పడం అందుకు రాజయ్య సంతోషపడటం ఆ ఆడియో క్లిప్పింగులో ఉంది.
టికెట్ ఖరారు అయిన తరువాత ఈ ఆడియో క్లిప్పింగ్ మీడియా చేతికి అందడం వెనుక టిఆర్ఎస్లోనో లేక బయట ఆయన రాజకీయ ప్రత్యర్ధుల హస్తం ఉండి ఉండవచ్చు. ఏమైనప్పటికీ అదిప్పుడు మీడియా ఛానల్స్ చేతిలో పడింది కనుక రాజయ్యకు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు.