తెలంగాణా కీర్తికిరీటంలో మరో ఏడు వజ్రాలు

గత 51 నెలలో తెలంగాణా రాష్ట్రం, ప్రభుత్వం జాతీయస్థాయిలో అనేక అవార్డులు అందుకొని యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది. తాజాగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ వివిద విభాగాలలో ఏకంగా ఏడు జాతీయ అవార్డులు అందుకొంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిల్లీలోని విజ్ఞాన్ భవన్ ప్లీనరీ హాల్‌లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, ఆ శాఖ అధికారులు పాల్గొని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు. తెలంగాణా రాష్ట్రానికి లభించిన జాతీయ అవార్డుల వివరాలు: 

1. పారదర్శకత మరియు జవాబుదారీతనం (ప్రధమస్థానం).  

2. ఉపాధి హామీ పధకాల అమలు, సుపరిపాలన (ద్వితీయ స్థానం).  

3. ఉపాధి హామీ పధకాల అమలులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాల విభాగంలో వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు అవార్డు లభించింది.

4. ఉపాధి హామీ పధకాలలో సకాలంలో కూలీలాకు నగదు చెల్లింపు చేసినందుకు రాష్ట్రానికి ఒక అవార్డు లభించింది.     

5. ఉపాధి హామీ పధకాల అమలులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామ పంచాయితీలలో ఇబ్రాహీం పూర్, సిద్ధిపేట పంచాయితీలకు అవార్డు లభించింది.   

6. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పధకం అమలు. 

7. గ్రామీణ స్థాయిలో స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అమలుచేసి శిక్షణా కార్యక్రమాలు సమర్ధంగా నిర్వర్తించినందుకు అవార్డు లభించింది.