1.jpg)
సిఎం కెసిఆర్ శుక్రవారం హుస్నాబాద్ లో ప్రజా ఆశీర్వాద సభలో జానారెడ్డిని ఉద్దేశ్యించి, “మా ప్రభుత్వం రాష్ట్రంలో 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా చేసినట్లయితే కాంగ్రెస్ నేత జానారెడ్డిగారు గులాబీ కండువా కప్పుకొని మాపార్టీ తరపున ప్రచారం చేస్తానని అసెంబ్లీ సాక్షిగా మాకు సవాలు విసిరారు. మేము చెప్పినట్లుగానే 24 గంటలు కరెంటు సరఫరా చేసి చూపించాము. కనుక ఇప్పుడు నేను జానారెడ్డిగారిని తన మాట నిలబెట్టుకోమని కోరుతున్నాను, “ అని సవాలు విసిరారు.
కెసిఆర్ సవాలుపై జానారెడ్డి స్పందిస్తూ, “నేను కూడా సిఎం కెసిఆర్‌ను సవాలు చేస్తున్నాను. నేను గులాబీ కండువా కప్పుకొని టిఆర్ఎస్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తానని శాసనసభ రికార్డులలో ఉన్నట్లయితే తక్షణం చూపించాలి. లేకుంటే 24 గంటలలోగా కెసిఆర్ బహిరంగంగా నాకు క్షమాపణ చెప్పాలి,” అని సవాలు విసిరారు.
జానారెడ్డి శాసనసభలో ఆ మాట అన్నారో లేదో కానీ వేరే సందర్భాలలో మాత్రం అన్నారు. టిఆర్ఎస్ తన హామీలను నిలబెట్టుకొంటే తాను టిఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తానని అన్నారు. కానీ ఆ సవాలును శాసనసభ వరకే పరిమితం చేసి, కెసిఆర్‌కు మళ్ళీ ప్రతిసవాలు విసురుతుండటం విశేషం.