సంబంధిత వార్తలు

టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా హైదరాబాద్ గోల్కొండ హోటల్లో టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, పెద్దిరెడ్డితదితరులతో రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. త్వరలో జరుగబోయే ఎన్నికలలో కాంగ్రెస్-టిడిపిల పొత్తులు, సీట్లు సర్దుబాట్ల గురించి వారు చర్చించినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజులలో టిడిపి అధినేత, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రానున్నారు. అప్పుడు రెండు పార్టీల పొత్తులపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.