
టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ ఈనెల 11వ తేదీన మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకొనున్నట్లు తాజా సమాచారం. ఆయనతోపాటు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్దం అవుతునట్లు సమాచారం. వారిరువురు ఈనెల 11వ తేదీన డిల్లీలో సోనియాగాంధీ లేదా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం.
అయితే మీడియాలో వస్తున్న ఆ వార్తలలో నిజం లేదని తనంతట తానుగా టిఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి వెళ్ళబోనని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తదుపరి కార్యాచరణ గురించి ఆలోచిస్తానని డిఎస్ అన్నారు. అయితే కధ ఇంతవరకు వచ్చాక ఆయన ఇంకా టిఆర్ఎస్లోనే కొనసాగినా పార్టీలో ఆయనకు ఎటువంటి గౌరవం లభించదు. అలాగని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా అక్కడ గౌరవం లభించడం కష్టమే. కనుక డిఎస్ తన రాజకీయ ప్రస్థానం చివరిదశలో చాలా అవమానకర పరిస్థితులను ఎదుర్కోక తప్పదేమో? సరిగ్గా మాట్లాడేందుకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తున్న ఆయన రాజకీయాల నుంచి తప్పుకొంటే కొంతైనా గౌరవం మిగులుతుంది కదా.