సంబంధిత వార్తలు
7.jpg)
సిఎం కెసిఆర్ రేపు శాసనసభను రద్దు చేసే ఆలోచనలో ఉన్నందున ఈరోజు ప్రభుత్వోద్యోగ సంఘాల నేతలతో ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పి.ఆర్.సి. తదితర అంశాలపై సిఎం కెసిఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. మొన్న విద్యుత్ ఉద్యోగులతో సమావేశం అయినపుడు వారు 32 శాతం పి.ఆర్.సి. అడిగితే సిఎం కెసిఆర్ 35శాతం పి.ఆర్.సి. ప్రకటించారు. కనుక తమకు కూడా భారీగానే పి.ఆర్.సి. మంజూరు చేస్తారని ఉద్యోగ సంఘాల నేతలు ఆశిస్తున్నారు. టిఆర్ఎస్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతోంది కనుక ప్రభుత్వోద్యోగుల మద్దతు కూడా చాలా అవసరం ఉంటుంది కనుక వారికి కూడా భారీగానే పి.ఆర్.సి. ప్రకటించే అవకాశం ఉంది.