
ముందస్తు ఎన్నికల గురించి టిఆర్ఎస్ చేస్తున్న హడావుడి చూసి టి-కాంగ్రెస్ నేతలు కూడా అప్రమత్తమయ్యారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ గాంధీ భవన్ లో పార్టీ ముఖ్యనేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. టిఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపికకు, ఎన్నికలకు సన్నాహాలకు కమిటీల ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 4-5 మందికి తప్ప మిగిలిన అందరికీ మళ్ళీ టికెట్లు ఇస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించేరు కనుక టిఆర్ఎస్ ఎన్నికలకు సిద్దంగానే ఉన్నట్లు చెప్పవచ్చు. కనుక ఒకవేళ సిఎం కెసిఆర్ సెప్టెంబర్ 10న అసెంబ్లీని రద్ధు చేసినట్లయితే టిఆర్ఎస్‌కు ఏమీ ఇబ్బంది ఉండదు కానీ ఇంకా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టని కారణంగా ప్రతిపక్షాలకు అట్టే సమయం ఉండదు. కనుక కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ అత్యవసర సమావేశాలు నిర్వహించుకొని ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టకతప్పదు.