ముందస్తు వరాలు!

ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని సిఎం కెసిఆర్‌ నిర్ణయించుకున్నారు కనుక ప్రజలపై ముందస్తు వరాల జల్లు కురిపించారు. ఆ వివరాలు: 

1. ఎస్సీ ఎస్టీ గృహవినియోగదారులకు 101 యూనిట్ల వరకు కరెంటు ఉచితం. 

2. ఇమామ్, మౌజమ్ ల గౌరవ వేతనం రూ.5,000 కు పెంపు. 

3. అర్చకుల పదవీ విరమణ వయసు 58 నుంచి 65కు పెంపు. 

4. అన్ని కులసంఘాలకు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ఉచితంగా స్థలాలు, నిర్మాణ ఖర్చులు ఇవ్వబడతాయి. 

5. మెఫ్మా రిసోర్స్ పర్సన్స్ మరియు 29 మినీ గురుకుల పాఠశాలలో సిబ్బండి జీతల పెంపు.        

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని  ఇప్పుడే అనుకొన్నారు కనుక ఈ ముందస్తు వరాలు తొలకరి జల్లు వంటివేనాని భావించవచ్చు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ చాలా భారీగా వరాలు కురిపించవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి, రైతులందరికీ ఒకేసారి రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇస్తోంది. అలాగే పెన్షన్ సొమ్మును రెట్టింపు చేస్తామని హామీ ఇస్తోండి. కనుక టిఆర్ఎస్‌ కూడా ఈ మూడు హామీలకు ధీటుగా హామీలు ప్రకటించే అవకాశం ఉందని భావించవచ్చు. సెప్టెంబర్ 2న జరిగే ప్రగతి నివేధన సభలో వీటిపై సిఎం కెసిఆర్‌ స్పష్టతనీయవచ్చు.