కేరళకు సాయం అంతేనా?

ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేస్తున్న ప్రధాని మోడీ కేరళ రాష్ట్రానికి ప్రధానమంత్రి సహాయనిధి నుంచి రూ.500 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అదీగాక కేరళలో వరదభాదితులలో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికీ రూ.50,000 సాయం అందజేస్తామని ప్రకటించారు. ఇదివరకు విశాఖలో హూద్ హూద్ తుఫాను వచ్చినప్పుడు విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ రూ.1,000 కోట్లు సాయం ప్రకటించారు. కానీ యావత్ కేరళ రాష్ట్రం వరదలతో తీవ్రంగా నష్టపోతే రూ.2,000 కోట్లు సాయం చేయాలని కేరళ ప్రభుత్వం కోరితే ప్రధాని మోడీ కేవలం రూ.500 కోట్లే ప్రకటించడంపై అక్కడి అధికార, ప్రతిపక్షాలు ఆగ్రహంగా ఉన్నాయి.