ఒకరు కాదు..ఇద్దరు జంప్

తెదేపా సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయనతోపాటు తెదేపాకే చెందిన మదన్ మోహన్ రావు కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ వారిరువురినీ తోడ్కొని రేపు డిల్లీ తీసుకువెళ్ళి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేత పార్టీ కండువాలు కప్పించి కాంగ్రెస్ పార్టీలో చేర్చబోతున్నారు. 

ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడే మదన్ మోహన్ రావు. మావగారు తెరాసలోకి వెళ్ళినప్పటికీ అల్లుడు మాత్రం ఇంతకాలం తెదేపానే అంటిపెట్టుకొని ఉండటం విశేషం. ఇప్పుడు అయన కూడా పార్టీ మారడానికి సిద్దం అవుతున్నారు. అయితే తెరాసలోకి వెళ్ళకుండా కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నారు కనుక మామ అల్లుళ్ళ మద్య రాజకీయ శత్రుత్వం ఏర్పడుతుంది. కుటుంబంలో రాజకీయ శత్రుత్వం వద్దనుకొంటే ఎర్రబెల్లి కూడా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయవలసి ఉంటుంది. మదన్ మోహన్ రావు 2014 ఎన్నికలలో తెదేపా తరపున జహీరాబాద్ నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోగా, వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ నుంచి కెసిఆర్ పై పోటీ చేసి ఓడిపోయారు.