సంబంధిత వార్తలు

ఎవరూ ఊహించనివిధంగా తెరాస కు చెందిన ముగ్గురు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డారు. సస్పెండ్ అయినవారిలో నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వాతి సింగ్ భర్త సంజయ్ సింగ్ బబ్లూ, ఒక తెరాస కౌన్సిలర్ భర్త వినోద్, జంబీ హనుమాన్ ఆలయం చైర్మన్ రంగన్నలను పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ ఆదేశాల మేరకు తెరాస నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ కార్యదర్శి తుల ఉమ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. వారి ముగ్గురి సభ్యత్వాలను కూడా రద్దు చేసినట్లు ఆమె తెలిపారు. పార్టీకి అప్రదిష్ట కలిగించే అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకు ముగ్గురినీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తుల ఉమ తెలిపారు.