13.jpg)
గవర్నర్ కోటాలో అమీర్ అలీ, ప్రొఫెసర్ కోదండరాంలు ఎమ్మెల్సీలుగా నియామకాలపై ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని నేడు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారి నియామకాలపై అభ్యంతరం చెపుతూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ గతంలో వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ అమీర్ అలీ మరో పిటిషన్ వేశారు.
దానిపై నేడు విచారణ చేపట్టిన జస్టిస్ విక్రంనాథ్ ధర్మాసనం, గత ఏడాది ఆగస్ట్ 13న తాము జారీ చేసిన మద్యంతర ఉత్తర్వులలోనే ఈ విషయం స్పష్టం చేశామని తెలియజేసింది. గవర్నర్ కోటాలో నియామకాలపై సుప్రీంకోర్టు అడ్డు చెప్పలేదని, ప్రభుత్వ సిఫార్సుని బట్టి గవర్నర్ తన విచాక్షణాధికారంతో తగిన నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారాన్ని మార్చి 19కి వాయిదా వేసింది.