కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి కోటి నష్ట పరిహారం

ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (25) కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు నష్ట పరిహారం, ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నేడు ఆమె కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చిన తర్వాత వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.    

ఈ నెల 23న నిజామాబాద్‌లో గంజాయి రవాణా చేస్తున్న ఓ ముఠాని అడ్డుకునేందుకు కానిస్టేబుల్ సౌమ్య ప్రయత్నించినప్పుడు, వారు తమ వాహనంతో ఆమెను బలంగా డీకొట్టి పారిపోయారు. ఆమెను వెంటనే హైదరాబాద్‌ నీమ్స్ హాస్పిటల్‌కు తరలించినప్పటికీ చికిత్స అందించారు. కానీ అంతర్గత అవయవాలు బాగా దెబ్బ తిని తీవ్ర రక్తస్రావం జరగడంతో వైద్యులు ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. శనివారం రాత్రి ఆమె మృతి చెందారు.