3.jpg)
ప్రభుత్వోద్యోగ సంఘాల నేతల డిమాండ్లపై చర్చించేందుకు ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో మంత్రులు కేటిఆర్, జగదీశ్ రెడ్డిలతో ఏర్పాటు చేసిన మంత్రుల సబ్-కమిటీ వారితో చర్చలు జరిపి నివేదిక సిద్దం చేస్తోంది. దానిని మరొక రేను మూడు రోజులలో ముఖ్యమంత్రి కెసిఆర్ అందించబోతున్నారు. ఆ నివేదికలో మంత్రుల కమిటీ చేసిన సిఫార్సులను పరిశీలించిన తరువాత మే 14న ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యోగ సంఘాల నేతలతో ముఖాముఖి సమావేశమయ్యి వారితో మరోసారి మాట్లాడి తన నిర్ణయం తెలియజేస్తారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడూ తన ఉద్యోగులను నిరాశపరచలేదు కనుక ఈసారి కూడా తమ డిమాండ్లను అన్నిటికీ అయన అంగీకరిస్తారనే నమ్మకంతోనే ఉద్యోగ సంఘాల నేతలున్నారు. వారు మొత్తం 18 డిమాండ్లను మంత్రుల సబ్-కమిటీ ముందుంచారు.