సంబంధిత వార్తలు

ఇటీవల కాలంలో దేశంలో మహిళలు, చిన్నారి బాలికలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయి. మహిళలకు ఈ భూమ్మీదే కాదు...గాలిలో కూడా భద్రతలేదని నిరూపించే సంఘటన ఇది. ఎయిర్ ఇండియా విమాన పైలట్ తన విమానంలో ప్రయాణికులకు సేవలు అందించే ఎయిర్ హోస్టస్ పై అత్యాచారం చేశాడు.
మే 4వ తేదీన అహ్మదాబాద్ నుంచి ముంబై వెళుతుండగా, పైలట్ విమానంలోనే తనపై అత్యాచారం చేశాడని ఆమె ముంబైలోని సహార్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. సహార్ పోలీసులు ఆ పైలట్ పై ఐపిసి సెక్షన్: 354 క్రింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులు, నిందితుడు ఇంకా స్పందించలేదు.