
ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన ఏర్పాటైన తెలంగాణా జనసమితి (టిజెఎస్) కొన్ని జిల్లాలకు ఇన్-ఛార్జ్ లను నియమించింది. సిద్ధిపేటకు బైరి రమేష్, నల్గొండ-విద్యాధర్ రెడ్డి, వరంగల్-అంబటి శ్రీనివాస్, వికారాబాద్-శ్రీశైలం రెడ్డి, నిజామాబాద్-గోపాల్ శర్మ, కరీంనగర్-గాదె ఇన్నయ్య, ఖమ్మం జిల్లాకు ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ లను ఇన్-ఛార్జ్ లుగా నియమించింది. ఇక నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టి ఎన్నికలకు సిద్దం అవుతామని ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ చెప్పారు.
తెరాసతో ఇతర పార్టీల నుంచి తెలంగాణా జనసమితిలోకి వలసలు ఉంటాయని ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. కానీ ఎన్నికలు దగ్గర పడి, టికెట్స్ కేటాయింపుల ప్రక్రియ మొదలయ్యేవరకు వలసలు ఉండకపోవచ్చు. వలసలు ఉన్నా లేకపోయినా అన్నివిధాల బలమైన కాంగ్రెస్, తెరాసలను టిజెఎస్ డ్డీకొనవలసి ఉంటుంది. కానీ టిజెఎస్ లో ప్రొఫెసర్ కోదండరాం, మరో ఒకరిద్దరు నేతలు తప్ప మిగిలినవారు తెలంగాణా ప్రజలకు పెద్దగా పరిచయం లేదు. పైగా కాంగ్రెస్, తెరాసలతో పోలిస్తే టిజెఎస్ ఆర్ధికంగా బలహీనంగా ఉంది. మరి ఈ నేపద్యంతో ప్రొఫెసర్ కోదండరాం తన పార్టీ అభ్యర్ధులను ఏవిధంగా గెలిపించుకొంటారో చూడాలి.