హైదరాబాద్ లో తెదేపా మహానాడు!

మే 24న హైదరాబాద్ లో మహానాడు సభ నిర్వహించబోతున్నట్లు తెలంగాణా తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ మీడియాకు తెలియజేశారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెదేపా సీనియర్ నేతలు రేవూరి, నామా, రావుల, పెద్దిరెడ్డి తదితరులు సమావేశమయ్యి ఈ నెల 24న హైదరాబాద్ లో మహానాడు నిర్వహిద్దామని నిర్ణయించారు.