శనివారం సాయంత్రం కోదండరాం రాజీనామా!

టిజెఎసి అధ్యక్షుడు కోదండరాం శనివారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. అయన తెలంగాణా జనసమితి (టిజెఎస్) అనే కొత్త రాజకీయపార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. రేపు అంటే ఆదివారం సాయంత్రం సరూర్ నగర్ లో జరుగబోయే పార్టీ అవిర్భావసభలో అయన టిజెఎస్ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అందుకే టిజెఎసి పదవికి రాజీనామా చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద అయన రాజీనామా చేయబోతున్నారు.