కెసిఆర్ అనే నేను సినిమా తీస్తా: పొన్నం

తెరాస ప్లీనరీపై మొట్టమొదట స్పందించిన వ్యక్తి కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. మీడియాతో మాట్లాడుతూ, “ప్లీనరీ వేదికకు ప్రగతి ప్రాంగణం అని పేరు పెట్టి కెసిఆర్ ప్రజలను మరొకసారి మోసం చేశారు. సోనియా గాంధీయే తెలంగాణా రాష్ట్రానిచ్చిందని, ఆమె దేవతతో సమానం అని శాసనమండలిలో స్వయంగా చెప్పిన కెసిఆర్, ప్లీనరీలో కనీసం ఆమె పేరును తలుచుకోకపోగా మా పార్టీని నోటికి వచ్చినట్లు దూషించి సంస్కారంలేని వ్యక్తి అని నిరూపించుకొన్నారు. ప్లీనరీ అబద్దాలకు, కెసిఆర్ భజనకు వేదికగా మార్చేశారు. అయన ఎన్ని అబద్దాలు చెప్పారో మేము ప్రజలకు వివరిస్తాము. అయన చెపుతున్న అబద్దాలు, చేస్తున్న మోసాలపై ‘కెసిఆర్ అనే నేను’ సినిమా తీస్తాము,” అని అన్నారు.