4.jpg)
హైదరాబాద్, కొంపల్లిలో ఇవ్వాళ్ళ జరుగుతున్న తెరాస ప్లీనరీలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు, కెసిఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్లేందుకు తెరాస ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా సుదీర్ఘంగా ప్రసంగించిన కెసిఆర్, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు తన కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 29వ తేదీన చెన్నై వెళ్ళి డిఎంకె నేతలను, మే 2న లక్నో వెళ్ళి సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ ను కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చలు జరుపుతానని అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా దేశరాజకీయలను ప్రభావితం చేస్తానని కెసిఆర్ అన్నారు. మే నెలలోనే కెసిఆర్ భువనేశ్వర్ వెళ్ళి ఓడిశా ముఖ్యమంత్రినవీన్ పట్నాయక్ ను కలిసి ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించబోతున్నారు.