తెలంగాణాలో మరో కొత్త పార్టీ!

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రతీ రాష్ట్రంలోను కొత్త పార్టీలు, కూటములు పుట్టుకువస్తుంటాయి. గత రెండు నెలలో తెలంగాణా రాష్ట్రంలో తెలంగాణా ప్రజల పార్టీ(మాజీ జడ్జి బెజ్జారం చంద్రకుమార్), టిజెఎస్ (ప్రొఫెసర్ కోదండరాం), బిఎల్ఎఫ్ (కూటమి) ఏర్పాటు అయ్యాయి. తాజాగా తెదేపా ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కూడా ఒక రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. బిసిలకు రాజ్యాధికారం కల్పించడమే లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అగ్రవర్ణ రాజకీయ నేతలకు ఓట్లు వేసి వారిని హక్కుల కోసం రాజ్యాధికారం కోసం బిసిలు బిచ్చమెత్తుకోవలసిన అవసరం లేదని అన్నారు. బిసిల ఆత్మగౌరవం కాపాడి వారికి రాజ్యాధికారం కల్పించడం కోసమే పార్టీని స్థాపించాలనుకొంటున్నట్లు చెప్పారు. త్వరలోనే పార్టీ పేరు, జెండా, అజెండా వగైరా వివరాలను వెల్లడిస్తానని చెప్పారు.