వరంగల్, సికింద్రాబాద్ లో దారుణ హత్యలు

వరంగల్ లో దారుణహత్య జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద గల ఆటో స్టాండ్ కు సమీపంలో ఒక గోనె సంచి పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ సంచీని తెరిచి చూడగా దానిలో తల లేని మొండెం కనబడటంతో అందరూ అవాక్కయ్యారు. అదే సమయంలో నగరంలోనే వేరే చోట తల లభించింది. అది స్థానిక రౌడీ సాంబయ్యదిగా పోలీసులు గుర్తించారు. రౌడీ గ్యాంగుల మద్య జరిగిన ఘర్షణలలో ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సోమవారం ఉదయం సికింద్రాబాద్ వద్ద రేతిఫైల్ బస్టాండ్ వద్ద అంతకంటే దారుణహత్య జరిగింది. అక్కడ బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తుండగా, ఆరుగురు గూండాలు మరొక గూండాను చుట్టుముట్టి కత్తులతో పొడిచిచంపి పారిపోయారు. అది చూసి అక్కడున్న జనం భయంతో పరుగులు తీశారు. ప్రాధమిక సమాచారం ప్రకారం హత్యకు గురైన వ్యక్తి ఒక వ్యభిచారగృహంలో గుండా అని, అతను ఇటీవలే జైలు నుంచి విడుదలై బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ ఏర్పాటు చేసిన సిసి కెమెరాలలో ఈ హత్య రికార్డ్ అవడంతో పోలీసులు హత్యచేసినవారి కోసం గాలిస్తున్నారు.