టిటిడి చైర్మన్ గా సుధాకర్ యాదవ్

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా కడప జిల్లాకు చెందిన తెదేపా నేత పుట్టా సుధాకర్ యాదవ్ నియమించారు ఏపి సిఎం చంద్రబాబు నాయుడు. అయన ఇదివరకు తితిదే పాలకమండలిలో సభ్యులుగా పనిచేశారు. ఇక మరో విశేషమేమిటంటే, కొంతకాలం క్రితం తెదేపాలో చేరిన సమైక్యరాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఏపి రాష్ట్ర సాగునీటి అభివృద్ధి సంస్థ అధ్యక్ష పదవి కట్టబెట్టారు.