ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాలలోకి వచ్చామని చెప్పుకొని పదవులు, అధికారం, కాంట్రాక్టుల కోసం తాపత్రయపడే రాజకీయ నేతలను చూశాము. కానీ స్వంత ఇల్లు కట్టుకొన్నా అది ప్రజల కోసమేనని చెప్పే రాజకీయ నేతలను చూసి ఉండము. వరంగల్ తూర్పు నియోజకవర్గపు ఎమ్మెల్యే కొండా సురేఖ అటువంటి గొప్ప నేత. ఆమె వరంగల్ కొత్తవాడలో గల శాంతి నగర్ లో కొత్తగా ఇల్లు నిర్మించుకొని సోమవారం దానిలోకి గృహాప్రవేశం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నేను నా నియోజక వర్గపు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇక్కడ ఇల్లు నిర్మించుకొన్నాను. నా నియోజకవర్గాన్ని అన్నివిధాల అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. ఇక నుంచి ఈ ఇంటి నుంచే నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తాను,” అని చెప్పారు.