ప్రస్తుతం రాష్ట్ర ఇన్-ఛార్జ్ డిజిపిగా వ్యవహరిస్తున్న ఎం.మహేందర్ రెడ్డిని పూర్తిస్థాయి డిజిపిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ డానికి సంబంధించిన ఫైలుపై నిన్న సంతకం చేశారు.
ఇప్పటివరకు రాష్ట్రాల డిజిపి నియామకాలు యు.పి.ఎస్.సి. అనుమతితో జరుగుతుండేవి. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకొన్నా ముగ్గురు వ్యక్తుల జాబితాను యు.పి.ఎస్.సి. ఆమోదించిన తరువాత వారిలో తనకు నచ్చినవారిని ముఖ్యమంత్రి డిజిపిగా నియమించుకొనేవారు. కానీ దిజిపిలను నియమించుకొనే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే దాఖలు చేస్తూ ఇటీవల శాసనసభలో ఒక చట్టం చేసింది. కనుక ఎం.మహేందర్ రెడ్డిని డిజిపిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.