నీరవ్ మోడీ అరెస్ట్?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు రూ.13,500 కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ప్రస్తుతం హాంకాంగ్ లో ఉన్నట్లు కనుగొన్న భారత సర్కార్, అతనిని అరెస్ట్ చేసి తమకు అప్పగించాలని గత నెల23న హాంకాంగ్ అధారిటీకి ఒక లేఖ వ్రాసింది. ఇటువంటి వ్యవహారాలలో పరస్పరం సహాయసహకారాలు అందించుకొనేందుకు ఇరు దేశాల మద్య ఒప్పందం చేసుకొన్నందున, నీరవ్ మోడీని త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నట్లు చైనా విదేశీవ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి జంగ్ షుయాంగ్ మీడియాకు తెలిపారు. సిబిఐ కోర్టు నీరవ్ మోడీ, మోహన్ చౌక్సిలపై ఆదివారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్స్ జారీ చేసింది. నీరవ్ మోడీని రప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి లండన్ పారిపోయి కళ్ళెదుటే తిరుగుతున్న విజయ్ మాల్యాను వెనక్కు రప్పించడం దాదాపు అసంభవమనిపిస్తోంది.