ఉత్తమ్ దీక్ష!

తెలంగాణా రాష్ట్రంలో దళితులపై దాడులకు నిరసనగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ కుంతియా సోమవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కెసిఆర్ థానే ఆ పదవిని చేపట్టిన రోజు నుంచి నేటి వరకు రాష్ట్రంలో దళితులను, గిరిజనులను మోసం చేస్తూనే ఉన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదు. గిరిజనులకు రిజర్వేషన్ల శాతం పెంచుతామన్నారు. కానీ పెంచలేదు. నేరెళ్ళ ఘటనలో దళితులపై దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం పట్టించుకోడం లేదు. రాజకీయ దురుదేశ్యంతోనే దళితుడైన సంపత్ కుమార్ శాసనసభ్యత్వం రద్దు చేశారు. తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో గిరిజనులు, దళితులపై దాడులు పెరిగిపోయాయి. అందుకు నిరసనగా మేము ఈరోజు దీక్ష చేపట్టాము. ఏప్రిల్ 23న డిల్లీలో జరుగబోతున్న దళిత విచారణ సమ్మేళనంలో పాల్గొని రాష్ట్రంలో దళితుల పరిస్థితి గురించి వివరించి దేశప్రజల దృష్టికి, మా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకు వెళతాము,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.