సంబంధిత వార్తలు
ఘోషా మహల్ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యాప్రయత్నం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయన పై ఆదివారం సాయంత్రం ఔరంగాబాద్ లో జరిగిన సభలో పాల్గొని తన కారులో తిరిగివస్తుండగా వెనుక నుంచి ఒక లారీవచ్చి ఆ కారును బలంగా డ్డీకొంది. ఈ ఘటనలో రాజాసింగ్ సురక్షితంగా బయటపడ్డారు కానీ కారులో ఆయనతో పాటు ప్రయాణిస్తున్న కొందరికి తీవ్రంగా గాయపడ్డారు. కారును డ్డీకొన్న తరువాత డ్రైవర్ పరారయ్యాడు కానీ క్లీనర్ మాత్రం పట్టుబడ్డాడు. పోలీసులు అతనిని అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై జరిగింది హత్యాప్రయత్నమా లేక ప్రమాదమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.