జనంలేని పార్టీ టిజెఎస్: నాయిని

రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింసింహారెడ్డి మంత్రి నాయిని నర్సింసింహారెడ్డి కొత్తగా ఏర్పాటవుతున్న తెలంగాణా జనసమితి, దాని అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా, జోగిపేటలో ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నాయిని మాట్లాడుతూ, “వెనక జనం లేని సమితి తెలంగాణా జన సమితి. దాని అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సభ పెడితే పట్టుమని వందమంది కూడా రారు. అసలు అయన ఎవరంటే రాష్ట్రంలో చాలా మంది చెప్పలేరు. అయన కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయాలు చేస్తున్న వ్యక్తి. కొత్తగా పార్టీ పెట్టుకొని రాజకీయాలలోకి వస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. అయన తన పార్టీ గురించి ఏమైనా చెప్పుకోవచ్చు. కానీ తెలంగాణా ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనంగా నిలుస్తున్న ‘ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టాలి’ అని చెప్పడం చాలా తప్పు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి శాశ్వితంగా గడ్డంతోనే బ్రతకవలసి ఉంటుంది,” అని అన్నారు. 

ప్రొఫెసర్ కోదండరాంకు దమ్ముంటే పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి తమను ఎదుర్కోవాలని తెరాస నేతలు సవాలు చేశారు. వారి సవాలును అయన స్వీకరించిప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తుంటే తెరాస నేతలు ఉలిక్కిపడటం ఎందుకు?తెలంగాణా జన సమితికి దాని ప్రొఫెసర్ కోదండరాం ప్రజాధారణ ఉందో లేదో త్వరలోనే తేలిపోతుంది. దానిని తేల్చవలసినవారు ప్రజలే తప్ప తెరాస నేతలు కారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలాగూ రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని ప్రకటించారు కనుక అప్పుడే గడ్డం కూడా తీసుకొనే వెసులుబాటు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో అని తెరాస నేతలు ఆలోచించడంకంటే తెరాస సిటింగ్ ఎమ్మెల్యేలలో ఎంతమందికి మళ్ళీ టికెట్స్ లభిస్తాయి? లభించకపోతే ఏమి చేయాలని ఆలోచిస్తే మంచిదేమో?