ఏప్రిల్ 22న కూకట్ పల్లిలో మెగా లోక్ అదాలత్

ఏప్రిల్ 22న కూకట్ పల్లి కోర్టు ప్రాంగణంలో మెగా లోక్ అదాలత్ నిర్వహించబోతున్నట్లు 9వ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్ తెలియజేశారు. కనుక చందానగర్, సనత్ నగర్, బాలా నగర్, మియాపూర్, బాచుపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్ పల్లి, కెపిహెచ్బి, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన చిన్న కేసులపై విచారణ జరుపుతామని తెలిపారు. ఏప్రిల్ 22న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ లోక్అదాలత్ జరుగుతుందని తెలిపారు.  దొంగతనాలు, కుటుంబ వివాదాలు, భార్యాభర్తల వివాదాలు, చీటింగ్, చెక్ బౌన్స్ తదితర కేసులలో అవకాశం ఉన్నవాటిపై తక్షణమే తీర్పు వెల్లడిస్తామని తెలిపారు. కనుక పైన పేర్కొన్న పోలీస్ స్టేషన్లలో కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా న్యాయమూర్తి కోరారు.